Translate

Thursday, 27 March 2014

Stylish Star Allu Arjun @11

TRANSLATE TO KNOWN LANGUAGE

Allu Arjun completed 11 years in film industry. Arjun worked as a child artist in the film Vijetha and made a guest appearance in Daddy. Arjun made his debut as actor in K. Raghavendra Rao's Gangotri (2003).



స్టైలిష్ స్టార్‌గా, సక్సెస్ ఫుల్ హీరోగా టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచిన అల్లు అర్జున్ నేటితో ఇండస్ట్రీలోకి అడగు పెట్టి 11 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. హాస్య నటుడు అల్లు రామలింగయ్య మనవడిగా, నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా.... వారసత్వం ఉండటంతో బన్నీ ఎంట్రీ చాలా సులభంగానే జరిగింది. తొలి చిత్రం ‘గంగోత్రి' రాఘవేంద్రరావు లాంటి పెద్ద దర్శకుడితో చేయడంతో తొలి సినిమాతోనే హిట్ కొట్టాడు బన్నీ. ఈ చిత్రం మార్చి 28, 2003లో విడులైంది. గంగోత్రి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైనా తనతైన టాలెంట్ తో స్టైలిష్ స్టార్‌గా ఎదిగాడు బన్నీ. ఆర్య చిత్రంతో ఫీల్ మై లవ్ అంటూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో విజయవంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న బన్నీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. హ్యాపీ, దేశ ముదురు, ఆర్య 2, వేదం, బద్రినాథ్, జులాయి, ఇద్దరమ్మాయిలతో చిత్రాల్లో తనదైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం బన్ని-సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రేసు గుర్రం' చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. మరో శుభవార్త ఏమిటంటే మరికొన్ని రోజుల్లో అల్లు అర్జున్ తండ్రి కాబోతున్నాడు. ఓ వైపు ‘రేసు గుర్రం' సినిమా విడుదల సంబరాలతో పాటు, అల్లు అర్జున్ తండ్రయిన సంబరాలు కూడా ఒకేసారి జరుగుబోతున్నాయన్నమాట.

No comments:

Post a Comment